: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ముఖ్యాంశాలు... పార్ట్-4


2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులోని ప్రధానాంశాలు... * సతత హరిత నగరంగా నూతన రాజధాని * 39,252 ఎకరాల్లో రైతుల సమ్మతితో నిర్మాణం * మూడేళ్లలో రైతులకు తిరిగి భూమి అప్పగింత * గోదావరి పుష్కరాలకు రూ. 1,368 కోట్లు * పుష్కరాల విజయవంతానికి అన్ని శాఖలతో సమన్వయం * రహదారి వ్యవస్థను మెరుగు పరుస్తాం * రహదారి ప్రమాదాలను తగ్గిస్తాం * లెర్నర్ లైసెన్స్ తీసుకునే సమయంలోనే భద్రతపై అవగాహన * పోర్టులను అభివృద్ధి చేసేందుకు కృషి * కళింగపట్నం, నరసాపురం నౌకాశ్రయాల్లో పీపీపీ విధానంలో అభివృద్ధి * విజయవాడ, తిరుపతి, విశాఖ విమానాశ్రయాల అభివృద్ధి * దొనకొండ, నాగార్జున సాగర్, కుప్పం, దగదర్తి, ఓర్వకల్లు వద్ద ప్రాంతీయ విమానాశ్రయాలు * చమురు రంగంలో వ్యాపారం చేయనున్న ఏపీజీడీసీ * కాకినాడ డీప్ వాటర్ పోర్టు కేంద్రంగా చమురు వ్యాపారం * చమురు రంగంలో పనుల కోసం రూ. 195 కోట్ల కేటాయింపులు * చిత్తూరు జిల్లలో మాన్యుఫాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం * మాన్యుఫాక్చరింగ్ జోన్ కు భూ సేకరణ నిమిత్తం రూ. 637 కోట్లు * కొత్త పర్యాటక పథకాల అమలు * కొత్త రాజధానిలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా విజయవాడ భవానీ ద్వీపం * కృష్ణా, గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో టూరిజం సర్క్యూట్లు * 50 స్టార్ట్ అప్ కంపెనీలకు ప్రోత్సాహం * ఎర్రచందనాన్ని కాపాడేందుకు కార్యాచరణ * అటవీ భూముల వృద్ధికి 50 కోట్ల నర్సరీ మొక్కల పెంపకం * హోం గార్డులు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 2 లక్షల పరిహారం * అర్చకుల కనీస నెల జీతం రూ. 5 వేలు * రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆర్థిక లోటు 3 శాతం, రెవెన్యూ లోటు 1.24 శాతం

  • Loading...

More Telugu News