: విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు బడ్జెట్ లో నిధులు
ఏపీ బడ్జెట్ లో విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. ఈ రెండింటికీ కలిపి రూ.300 కోట్లు కేటాయించినట్టు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో కూడా ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు మెట్రోలకు సంబంధించి ముందస్తు ప్రణాళికను రూపొందిస్తున్నారు. రాజధాని భూ సమీకరణ అభివృద్ధికి రూ.3030.26 కోట్లు కేటాయించారు.