: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ముఖ్యాంశాలు... పార్ట్-3


2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులోని ప్రధానాంశాలు... * కొత్త రాజధానికి రూ. 3,168 కోట్లు * రెవెన్యూ శాఖకు రూ. 1,429 కోట్లు * సాగునీటి రంగానికి రూ. 5,258 కోట్లు * ఎస్సీల అభివృద్ధికి రూ. 5,878 కోట్లు * కొత్త ఆయకట్టు కోసం నిర్మాణంలో 92 పథకాలు * షెడ్యూల్ కులాల సాధికారతకు కట్టుబడి ఉన్నాము * గిరిజన స్కూల్స్ లో ఫలితాలు భేష్ * సంక్షేమ వసతి గృహాలను గురుకుల పాఠశాలలుగా మారుస్తాం * ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 'ఎన్టీఆర్ విద్యోన్నతి' * రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అధీనంలో 7 వేల ఎకరాల భూమి * గిరిజన తెగలలో బలహీన తెగల వర్గం గుర్తిస్తాం * సీఆర్ డీఎ ద్వారా రాజధాని రైతులకు పరిహారం చెల్లింపులు * కాపుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు * బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 35 కోట్లు * గర్భీణీ, బాలింతల కోసం 'అన్న హస్తం' * 'అన్న హస్తం' కోసం రూ. 104 కోట్లు * ఆప్కోకు పావలా వడ్డీ పథకం కింద రూ. 3.08 కోట్లు * 2015-16లో 2.7 లక్షల కొత్త ఇళ్ళు * ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లకు 'జియో ట్యాగింగ్' పూర్తి చేస్తాం * చంద్రన్న సంక్రాంతితో పేదల కళ్లల్లో ఆనందం చూసాం * రైతుకు అండదండగా ప్రభుత్వం * స్వయం సహాయక బృందాల ద్వారా ధాన్యం కొనుగోలు * అక్రమ నిల్వదారులపై ఉక్కుపాదం మోపుతాం * రాజధాని భూసేకరణకు 87 శాతం మంది రైతులు అంగీకరించారు * బోధనా ఆసుపత్రుల బలోపేతానికి కృషి * ఎయిమ్స్ తరహా ఆసుపత్రుల కోసం రూ. 5,728 కోట్లు * 10 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం * రాష్ట్రంతో ప్రపంచాన్ని అనుసంధానం చేసేందుకు చర్యలు * జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి * పరిశోధనల కోసం ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ బోర్డు ఏర్పాటు * టీవీ మాధ్యమం ద్వారా విద్యార్థులకు పాఠాలు

  • Loading...

More Telugu News