: ఏపీ రాజధాని నిర్మాణానికి రూ. 3,168 కోట్లు కేటాయింపు
అంతర్జాతీయ స్థాయిలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను ఈరోజు ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి కూడా నిధులకు కేటాయించారు. ఈ ఏడాదికి గాను రూ. 3,168 కోట్లు కేటాయిస్తున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రస్తుతం ఆయన బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది.