: ‘ఇండియాస్ డాటర్’పై నిషేధం తప్పే: కిరణ్ బేడీ వ్యాఖ్య


నిర్భయ ఘటనపై బ్రిటన్ మహిళా డైరెక్టర్ తెరకెక్కించిన డాక్యుమెంటరీ ‘ఇండియాస్ డాటర్’పై నిషేధం విధించడాన్ని మాజీ ఐపీఎస్ అధికారిణి, బీజేపీ నేత కిరణ్ బేడీ తప్పుబట్టారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కిరణ్ బేడీ అక్కడ ప్రదర్శితమైన సదరు డాక్యుమెంటరీని వీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారత్ లో డాక్యుమెంటరీపై నిషేధం విధించడం పొరపాటు చర్యేనని వ్యాఖ్యానించారు. అసలు డాక్యుమెంటరీలో ఏముందో చూడకుండా, విశ్లేషించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని కూడా ఆమె ప్రశ్నించారు. ఆడవాళ్ల పట్ల మగాళ్ల మైండ్ సెట్ ను కళ్లకు కట్టినట్టుగా చిత్రీకరించిన సదరు డాక్యుమెంటరీతో కొందరి మనసులైనా మారే అవకాశాలుండేవని ఆమె వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News