: మరో ఘనత... హిందూ మహా సముద్రంలో కృత్రిమ ద్వీపాలు నిర్మించనున్న ఇండియా
సముద్రం మధ్యన కృత్రిమ ద్వీపాలు నిర్మించిన దేశాల జాబితాలో భారత్ చేరనుంది. హిందూ మహా సముద్రంలో కృత్రిమ ద్వీపాలు నిర్మించేందుకు 'మౌలిక వనరుల అభివృద్ధి హక్కు'ను సొంతం చేసుకుంది. ఈ మేరకు మారిషస్, సీషెల్స్ ప్రభుత్వాలతో ఆ దేశాలలో పర్యటిస్తున్న మోదీ బృందం ఒప్పందాలు కుదుర్చుకుంది. రెండు దేశాలతో ఆర్థిక సహకారం ఇచ్చి పుచ్చుకోవాలని, ద్వైపాక్షిక సంబంధాల మెరుగునకు కూడా కీలక ఒప్పందాలు కుదిరాయి. చైనాతో బంధం అంత బలంగా లేని ప్రస్తుత పరిస్థితుల్లో మారిషస్, సీషెల్స్ తో డీల్స్ ఇండియాకు భవిష్యత్తులో మేలు చేకూరుస్తాయని నిపుణులు భావిస్తున్నారు. కాగా, ప్రస్తుతం మారిషస్ లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తదుపరి శ్రీలంకను కూడా సందర్శించనున్నారు.