: టెన్షన్ పెట్టిన క్వశ్చన్ పేపర్... పరీక్ష రాస్తూ గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి


ప్రశ్నాపత్రంలో కఠిన ప్రశ్నలు వచ్చాయో లేక సమాధానాలు రాయలేక ఫెయిల్ అవుతానని భయపడ్డాడో ఏమో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పరీక్ష రాస్తూ అకస్మాత్తుగా గుండె పోటు వచ్చి కుప్పకూలిపోయాడు. ఈ ఘటన కడప జిల్లా రాజంపేటలో నేడు (గురువారం) చోటు చేసుకుంది. పెనగలూరు మండలం ఓబిలి గ్రామానికి చెందిన కె.వెంకటేశ్వర్లు స్థానిక గీతాంజలి కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ రోజు పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థి, పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే కుప్పకూలిపోయాడు. స్పందించిన పాఠశాల సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News