: మేకప్ పాడవుతుందని కారు అద్దాలు మూసుకుని పోతారు: రోజాపై అయ్యన్నపాత్రుడి కౌంటర్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గృహ నిర్మాణంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ సందర్భంగా వైకాపా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, మంత్రి అచ్చెన్నాయుడు ప్రతి అంశంలో జోక్యం చేసుకుంటూ, సంబంధిత మంత్రిని కూడా మాట్లాడనివ్వడం లేదని వ్యాఖ్యానించారు. ఇతరులెవరికీ బుర్ర లేదన్నట్టు ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కారు అద్దాలు తెరుచుకుని వెళితే ప్రజల బాధ ఏంటో తెలుస్తుందని అధికార సభ్యులకు చురక అంటించారు. అనంతరం మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, రోజాపై విరుచుకుపడ్డారు. తామంతా అద్దాలు దించుకునే వెళుతున్నామని... మేకప్ పాడవుతుందేమోనని రోజానే అద్దాలు ఎత్తుకుని వెళుతున్నారని కౌంటర్ ఇచ్చారు.