: సామాన్యుడికి వీఐపీ భవంతి... 5 బెడ్ రూముల ఇంటికి మారనున్న కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యాధునిక భవంతిలోకి మారనున్నారు. ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ లో ఉన్న 5 బెడ్ రూముల ఇంటికి వచ్చేవారంలో ఆయన మారనున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులో ప్రకృతి వైద్య చికిత్స చేయించుకుంటున్న ఆయన మార్చి 17 ఢిల్లీ తిరిగి వస్తారని సమాచారం. గత నెలలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అధికార కార్యాలయం నిర్వహించేందుకు ప్రస్తుత ఇల్లు సరిపోవడంలేదని ఆయన భావించిన మీదట అధిరారులు కొత్త ఇంటిని సిద్ధం చేస్తున్నారు.