: టీవీ ఛానెల్ కార్యాలయంలోకి నాటు బాంబులు విసిరారు


ఏకంగా ఓ టీవీ ఛానెల్ కార్యాలయంలోకి నాటు బాంబులు విసిరారు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆగంతుకులు రెండు నాటు బాంబులు విసిరారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో తమ ఉద్యోగులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సదరు ఛానెల్ యాజమాన్యం తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News