: మన్మోహన్ కు మద్దతుగా... కదం తొక్కిన సోనియా దండు!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీచేసిన నేపథ్యంలో ఆయనకు పూర్తి మద్దతు తెలపాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయించారు. మన్మోహన్ కు సంఘీభావంగా సోనియా అధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ ఉదయం ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ నివాసం వరకూ ఈ సంఘీభావ ర్యాలీ జరిగింది. కాగా, యూపీఏ హయాంలో బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించి మన్మోహన్ సింగ్ ను నిందితుడిగా ఏప్రిల్ 8న జరిగే విచారణకు హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.