: మాది పిల్ల కాంగ్రెస్ కాదు... మీదే తెలుగు కాంగ్రెస్: వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీని అధికారపక్ష సభ్యులు పిల్ల కాంగ్రెస్ అంటూ సంబోధించగా జగన్ తీవ్రంగా స్పందించారు. ‘‘మాది పిల్ల కాంగ్రెస్ కాదు, మీదే తెలుగు కాంగ్రెస్’’ అంటూ ఆయన అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. సమస్యలను ప్రస్తావిస్తుంటే, వాటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యతను మరుస్తున్న అధికారపక్షం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అధికారం చేపట్టి పది నెలలు గడిచినా, ఒక్క ఇల్లు కట్టని చంద్రబాబు సర్కారు, మంజూరైన ఇళ్లను కూడా రద్దు చేస్తోందని ధ్వజమెత్తారు.