: బంగారు తెలంగాణ తరువాత... ముందు సారా తెలంగాణగా మార్చొద్దు: పొన్నం ఎద్దేవా
తెలంగాణ రాష్ట్రాన్ని 'సారా తెలంగాణ'గా మార్చే దిశలో కేసీఆర్ పరుగులు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ప్రజలపై విద్యుత్ భారం పడకుండా బంగారు తెలంగాణ సాధిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ఉదయం పొన్నం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ బడ్జెట్ ఊహల పల్లకిలా ఉందని ఎద్దేవా చేశారు. తెరాస ప్రభుత్వంపై మంచి మంచి కథనాలు రాస్తే విలేకరులకు బహుమతులు ఇస్తానని మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ అవకతవకలు బయటపెడితే తమ పార్టీ రూ. 1 లక్ష బహుమతిగా ఇస్తుందని ప్రకటించారు.