: వంద జన్మలెత్తినా వైఎస్ కు సాటిరారు... ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై కాకాని ఫైర్


ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. వైసీపీ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్ కోడెల శివప్రసాద్, ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ప్రస్తావించిన అధికార పక్షం, కాంగ్రెస్ సర్కారు అవినీతిపై విమర్శలు గుప్పించింది. దీంతో వైసీపీ సభ్యుడు కాకాని గోవర్ధన్ ఘాటుగా స్పందించారు. వంద జన్మలెత్తినా టీడీపీ నేతలు వైఎస్ రాజశేఖరరెడ్డికి సాటిరారని ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలను టీడీపీ అమలు చేయలేదని ఆయన తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News