: ‘గుడ్డు’ సమావేశంలో ఉద్రిక్తత... కాలర్లు పట్టుకున్న పౌల్ట్రీ రైతులు, ట్రేడర్లు


హైదరాబాదులోని వనస్థలిపురంలో జరిగిన నేషనల్ ఎగ్ కో ఆపరేషన్ కమిటీ (నెక్) సమావేశంలో వాగ్వాదం చోటుచేసుకుంది. కోడిగుడ్ల ధరల విషయంలో పౌల్ట్రీ రైతులు, వ్యాపారుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. తమ వద్ద రూ.3 కంటే తక్కువ ధరకే గుడ్లను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వినియోగదారులకు మాత్రం రూ.4లకు విక్రయిస్తున్నారంటూ రైతులు ఆరోపించారు. దళారీ వ్యవస్థను నిర్మూలించాల్సిన వ్యాపారులు చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆరోపణలను వ్యాపారులు ఖండిచారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒకానొక సందర్భంలో ఒకరినొకరు తోసేసుకున్నారు. అనంతరం నెక్ కార్యాలయంపై రైతులు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న గుడ్ల ధరలకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

  • Loading...

More Telugu News