: మన్మోహన్ కు సమన్లతో కాంగ్రెస్ లో కలవరపాటు... మరికాసేపట్లో నేతలతో సోనియా కీలక భేటీ


బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కోర్టు సమన్లు జారీ చేయడంతో కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. నిన్న మధ్యాహ్నమే సమన్లు జారీ అయినా, ఈ విషయంపై ఎలా స్పందించాలన్న విషయంపై మల్లగుల్లాలు పడిన పార్టీ అధిష్ఠానం, నేడు తెల్లవారగానే వేగంగా స్పందించింది. సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు పార్టీ ఎంపీలతో భేటీ కావాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. వెనువెంటనే సదరు నేతలకు సమాచారం వెళ్లింది. మరికొద్దిసేపట్లో ఏఐసీసీ కార్యాలయంలో ఈ భేటీ మొదలు కానుంది. బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ కు కోర్టు సమన్లు, పార్లమెంట్ లో పార్టీ వ్యవహరించాల్సిన తీరు, అధికార పక్షంపై ఎదురుదాడి తదితరాలపై సోనియా కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News