: ఈ నెల 15న అలహాబాదులో అసదుద్దీన్ రోడ్ షో... కుదరదన్న యూపీ సర్కారు


ఇప్పటికే విద్వేషపూరిత ప్రసంగాలతో దేశవ్యాప్తంగా నిరసనలను చవిచూసిన మజ్లిస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అధినేత, హైదరాబాదు లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఈ నెల 15న ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాదులో నిర్వహించనున్న రోడ్ షోకు అనుమతి లభించలేదు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ రోడ్ షోకు అనుమతివ్వలేమని ఉత్తర ప్రదేశ్ పోలీసులు తేల్చిచెప్పారు. సమాజ్ వాదీ పార్టీ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రోడ్ షోకు అనుమతి నిరాకరించిందని మజ్లిస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News