: ఎవరి శైలి వారిదే... నేను నాలానే ఉంటాను: జానారెడ్డి
ఎవరి శైలి వారికి ఉంటుందని తెలంగాణ సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడం లేదంటూ సొంత పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో హుందాగా తన శైలికి తగ్గట్లుగా వ్యవహరిస్తున్నానని అన్నారు. తన శైలి తనదేనని, ఇతరుల్లా తాను ఉండలేనని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ వైఖరిపై మెతక వైఖరి సరికాదని, దీనిని కాంగ్రెస్ అసమర్థతగా ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ విధానాలను విమర్శించకుండా, సానుకూల దృక్పథంతో వెళితే పార్టీకి నష్టమని వారు పేర్కొంటున్నారు.