: ఇకపై మంచు కురుస్తోందంటూ రైళ్లు ఆపక్కర్లేదు... కొత్త రైలు వచ్చేసింది!


మంచు కురిస్తే రైళ్లు రద్దు చేయాల్సిన అవసరం లేదిక. ఎందుకంటే భారీ ఎత్తున రైలు పట్టాలపై పేరుకుపోయిన మంచును ఛేదించుకుంటూ సాగిపోయే రైలును కెనడా శాస్త్రవేత్తలు రూపొందించారు. కెనడాలోని శాలిన్ బరీ ప్రాంతంలో భారీ ఎత్తున మంచు పేరుకుపోయిన పట్టాలపై దీనిని ప్రయోగాత్మకంగా నడిపించారు. పట్టాలపై పేరుకున్న మంచును తొలగించుకుంటూ రైలు సాగిపోయింది. ఇది అందుబాటులోకి వస్తే... మంచు కురుస్తోందని, పట్టాలపై నుంచి రైలు జారిపోయే ప్రమాదం ఉందని చింతించక్కర్లేదు. పాశ్చాత్య దేశాలను, జమ్మూకాశ్మీర్ ను మంచు అతలాకుతలం చేస్తోంది. మంచు కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోతోంది. ఇలాంటి రైలుతో వాటన్నింటికీ చెక్ చెప్పవచ్చు.

  • Loading...

More Telugu News