: ఈశాన్య రాష్ట్రాలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు... మణిపూర్ లో బాంబుపేలుడు
కేంద్ర హోం శాఖ ఈశాన్య రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు బెంగళూరు, పూణే, గుర్ గావ్ లో బాంబు దాడులు జరిగే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో కేంద్రం ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశంలోని ప్రధాన నగరాలే కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు కూడా ప్రమాదం అంచున ఉన్నాయని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తోంది. కాగా, మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు.