: విశాఖ సెంట్రల్ జైలులో ఖైదీ నిరాహార దీక్ష
విశాఖపట్టణంలోని కేంద్ర కారాగారంలో ఖైదీ నిరాహారదీక్షకు దిగాడు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారానికి తనను మార్చాలంటూ ఖైదీ చలపతిరావు నిరాహారదీక్ష చేపట్టాడు. చిలకలూరిపేట బస్సు దహనం కేసులో ప్రధాన నేరస్తుడిగా చలపతిరావు శిక్ష అనుభవిస్తున్నాడు. 1993 మార్చి 8న గుంటూరు జిల్లా చిలకలూరిపేట వద్ద చలపతిరావు, విజయానందరావు అనే వ్యక్తులు బస్సు దోపిడీకి విఫలయత్నం చేసి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 23 మంది సజీవ దహనమయ్యారు. దీంతో, చలపతిరావు, విజయానందరావులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. రాష్ట్రపతి క్షమాభిక్షతో అది జీవితఖైదుగా మారింది.