: అలహాబాద్ కోర్టులో ఎస్సై కాల్పులు... ప్రాణాలు విడిచిన లాయర్


ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో లాయర్ల మధ్య జరిగిన ఘర్షణను అదుపులోకి తెచ్చేందుకు ఓ ఎస్సై కాల్పులు జరపగా, న్యాయవాది మరణించాడు. ఘటన వివరాల్లోకెళితే... కోర్టు ఆవరణలోనే న్యాయవాదులు పరస్పరం కలబడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, ప్రయోజనం కనిపించలేదు. దీంతో, ఎస్సై కాల్పులు జరపడంతో రోషన్ అహ్మద్ అనే న్యాయవాది ప్రాణాలు విడిచాడు. ఫిరోజ్ నబీ అనే మరో లాయర్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటన గురించి తెలిసిన వెంటనే అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు కూడా అక్కడకు చేరుకుని విధ్వంసం సృష్టించారు. అలహాబాద్-కాన్పూర్ హైవేపైనా వాహనాలను అడ్డుకుని ధ్వంసం చేసేందుకు యత్నించారు.

  • Loading...

More Telugu News