: ఫ్రాన్స్ లో హైవేపై భారీ దోపిడీ
ఫ్రాన్స్ లోని బర్గండీ ప్రాంతంలో పారిస్-లియాన్ హైవేపై భారీ దోపిడీ చోటుచేసుకుంది. దాదాపు రూ.60 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. నగలను తీసుకెళుతున్న 2 వ్యాన్లను ఓ సాయుధ దొంగల ముఠా అడ్డగించింది. డ్రైవర్లను దించివేసి ఆ వ్యాన్లతో సహా పరారయ్యారు. దుండగులు 4 కార్లలో వచ్చారు. ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత ఆ రెండు వ్యాన్లను సమీప అటవీప్రాంతంలో గుర్తించారు. దుండగులు వాటిని దగ్ధం చేశారని పోలీసులు తెలిపారు. దోపిడీ దొంగల కోసం ప్రస్తుతం బర్గండీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. హైవేపై వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఫ్రాన్స్ లో జరిగిన దోపిడీల్లో ఇది భారీదని భావిస్తున్నారు.