: స్కాట్లాండ్ పై లంకేయుల ప్రతాపం!
వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా హోబర్ట్ లో జరిగిన పోరులో పసికూన స్కాట్లాండ్ పై శ్రీలంక ఘనవిజయం సాధించింది. 364 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 43.1 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో, లంక జట్టు 148 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్-ఎలో 2వ స్థానంలో నిలిచింది. స్కాట్లాండ్ జట్టులో కోల్ మన్ (70), మోమ్ సేన్ (60) మినహా మరెవరూ రాణించలేదు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' రికార్డు సెంచరీ హీరో కుమార సంగక్కరకు దక్కింది.