: పెళ్లికి వెళ్లిన 'మహా' సీఎం... దుమ్మెత్తిపోసిన విపక్షం


మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను ఏకిపారేయడానికి కారణాలు వెదుకుతున్న ప్రతిపక్షాలకు మంచి అవకాశం చిక్కింది! అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి, నాగ్ పూర్ లో ఓ వివాహానికి వెళ్లడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై, విపక్ష ఎన్సీపీ మండిపడుతోంది. అసెంబ్లీ సెషన్ కు హాజరుకాకుండా ఓ పెళ్లికి వెళ్లడం ద్వారా ముఖ్యమంత్రి రైతులను అవమానించారని మండలిలో విపక్ష ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే విమర్శించారు. అకాల వర్షాలు, రైతుల వెతల అంశంపై సభలో చర్చ జరుగుతుంటే ఆయన డుమ్మా కొట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. తీవ్ర కరవు నేపథ్యంలో లక్షలాది రైతులు దుర్భర పరిస్థితుల్లో చిక్కుకున్నారని, పరిస్థితి మరీ దిగజారిన ఇలాంటి సమయంలో పెళ్లికి వెళ్లడం అనేది రైతుల పట్ల ఆయన అమానుష వైఖరి తప్ప మరొకటి కాదని అన్నారు.

  • Loading...

More Telugu News