: ఆస్తుల కేసులో జయలలిత పిటిషన్ పై ముగిసిన వాదనలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత దాఖలు చేసిన పిటిషన్ పై కర్ణాటక హైకోర్టులో వాదనలు ముగిశాయి. త్వరలో ఈ పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువరించనుంది. జయతో పాటు మరో నలుగురు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జయను దోషిగా నిర్ధారించిన కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది.