: రాజమండ్రి అవినాష్ స్మగ్లర్ కూడానట!


తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిరుద్యోగుల నుంచి డబ్బు దండుకుని, తిరిగి అడిగినందుకు వారిని రూంలో బంధించి, చితకబాదిన అవినాష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వసూళ్లు, దౌర్జన్యాలకు పాల్పడే ఇతగాడిపై స్మగ్లింగ్ కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నాలుగేళ్ల కిందట భద్రాచలం సమీపంలో కారులో పులి చర్మాలను తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో అతనిపై కేసు కూడా నమోదైంది. తాజాగా, దౌర్జన్యాలకు సంబంధించి పత్రికలు, టీవీల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని మానవ హక్కుల సంఘం అతనిపై కేసు నమోదు చేసి, ఎస్పీ, కలెక్టర్ లను ఏప్రిల్ 6 నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, గతంలో అవినాష్ ను పట్టుకుని వదిలేసిన ఘటనలో పెద్దాపురం ఎస్సై, సీఐలకు మెమోలు జారీ అయ్యాయి. అతని నిర్వాకంపై టీవీల్లో కథనాలు రావడంతో అవినాష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతనిని పట్టుకునేందుకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతను హైదరాబాదులో ఉన్నట్టు గుర్తించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని అతని నివాసానికి ఓ బృందం వెళ్లింది.

  • Loading...

More Telugu News