: ఆప్ కు మహారాష్ట్రలో దెబ్బ... పదవులకు నేతల రాజీనామా


మహారాష్ట్రలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. కీలక నేతలు పార్టీ పదవులకు రాజీనామాలు చేయడంతో కలకలం రేగుతోంది. మహారాష్ట్ర ఆప్ కన్వీనర్ అంజలి దమానియా, కార్యదర్శి ప్రీతి శర్మ మీనన్ పదవులకు రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ సిద్ధాంతాలను నమ్మి తాము పార్టీలో చేరామని, పదవుల కోసం బేరసారాలు ఆడి ఆప్ లో చేరలేదని వారు స్పష్టం చేశారు. పార్టీయే ముఖ్యమని భావించడం వల్ల వ్యక్తిగత, వృత్తిగత జీవితాలకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయామని, ఇకపై వాటికి ప్రాధాన్యత ఇచ్చేందుకే పదవుల నుంచి వైదొలగుతున్నామని వారు తెలిపారు. పదవుల నుంచి వైదొలగుతున్నా, పార్టీకి మద్దతు కొనసాగిస్తామని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News