: అవయవదానం చేసిన మణికంఠ కుటుంబానికి హీరో శివాజీ ఆర్థిక సాయం


ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మణికంఠ అనే యువకుడు బ్రెయిన్ డెడ్ అవడం, అతడి అవయవాలను అతడి కుటుంబ సభ్యులు దానం చేయడం తెలిసిందే. దానిపై విపరీతమైన స్పందన కనిపించింది. తాజాగా మణికంఠ తల్లి, సోదరిని సినీ హీరో, బీజేపీ నేత శివాజీ విజయవాడలో పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి రూ.లక్ష ఆర్థికసాయం అందించారు. వారి కుటుంబానికి ప్రతి ఏడాది ఆర్థిక సాయం అందచేస్తానని శివాజీ చెప్పారు. మణి తల్లిని సొంత తల్లిలా చూసుకుంటానని, వారి బాగోగులు చూస్తానని చెప్పారు. అవయవదానం చేసిన మణికంఠ కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

  • Loading...

More Telugu News