: కొత్తగా రెండు అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్న చైనా


చైనా మరో రెండు అణు రియాక్టర్లను ఏర్పాటు చేయబోతోంది. లియోనింగ్ ప్రావిన్స్ లో ఉన్న ఓ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద అదనంగా ఈ రెండు రియాక్టర్లను నిర్మించనున్నారు. దీనికి కేబినెట్ ప్లానింగ్ ఏజన్సీ అనుమతించిందని ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ వెల్లడించింది. 2011లో సంభవించిన సునామీ జపాన్ లోని ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటును ముంచెత్తడంతో, ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు వ్యాపించాయి. అణువిద్యుత్ ప్లాంట్లను మూసివేయాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కూడా జరిగాయి. ఈ క్రమంలో, అప్పటి నుంచి కొత్త అణు విద్యుత్ ప్రాజెక్టులకు చైనా ప్రభుత్వం అనుమతులను మంజూరు చేయలేదు.

  • Loading...

More Telugu News