: కేఈ అంకుల్ చిన్నప్పుడు ఐస్ క్రీములు, చాక్లెట్లు కొనిచ్చారు: వైకాపా ఎమ్మెల్యే
ఏపీ శాసనసభ సమావేశాల్లో ఈ రోజు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వైకాపా డోన్ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పరస్పరం సెటైర్లు వేసుకున్నారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతున్న సందర్భంగా రాజేంద్రనాథ్ మాట్లాడుతుండగా, కేఈ కల్పించుకున్నారు. రాజేంద్రనాథ్ ప్రసంగం విని తలనొప్పి వస్తోందని... రాజరిక వంశంలో పుట్టిన ఆయనకు ప్రజల సమస్యలు ఏమి తెలుస్తాయని విమర్శించారు. దీనిపై వెంటనే స్పందించిన రాజేంద్రనాథ్... తన చిన్నతనంలో కేఈ అంకుల్ తనకు ఐస్ క్రీములు, చాక్ లెట్లు కొనిచ్చేవారని... అందువల్ల ఆయనపై విమర్శలు చేయలేనని కౌంటర్ ఇచ్చారు.