: మరోసారి గీత దాటొద్దు... ముఫ్తీకి బీజేపీ వార్నింగ్


జమ్ము కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే ముఫ్తీ మొహమ్మద్ సయీద్ వ్యాఖ్యలు, విధానాల పట్ల బీజేపీ అసహనానికి గురవుతోంది. తాజాగా వేర్పాటువాద నేత మసరాత్ ఆలంను విడుదల చేయడంతో విపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. దాంతో సీరియస్ అయిన బీజేపీ ముప్తీకి వార్నింగ్ ఇచ్చింది. జమ్ము కాశ్మీర్ లో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలో మరోసారి ఇలా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి, రెడ్ లైన్ దాటవద్దని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు జమ్ము కాశ్మీర్ బీజేపీ నేతలతో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన సమావేశంలో, మసరాత్ అంశంపై చర్చించారు. జాతి రక్షణ కోసం ఏ విషయంలోనూ రాజీపడేదిలేదని, బీజేపీ అన్ని పరిణామాలకు సిద్ధంగా ఉందని చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News