: ఏపీ విపత్తు శాఖ చర్యలు భేష్... ఫేస్ బుక్ నివేదిక వెల్లడి
ప్రకృతి వైపరీత్యాల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు పెను నష్టాన్ని నివారించడంలో ఏపీ విపత్తు శాఖ చేపట్టిన చర్యలపై ఫేస్ బుక్ ప్రసంశల జల్లు కురిపించింది. విపత్తుల సమయంలో సహాయక చర్యలు, ముందస్తు ప్రణాళికలపై ఇటీవల తాను రూపొందించిన నివేదికలో ఫేస్ బుక్, ఏపీ విపత్తు శాఖకు ప్రముఖ స్థానం కల్పించింది. ఇటీవల విశాఖను అతలాకుతలం చేసిన హుదూద్ సమయంలో ఏపీ విపత్తు శాఖ వ్యవహరించిన తీరు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రసార మాధ్యమాలను వాడుకున్న తీరు తదితరాలకు చెందిన ఫొటోలను ఫేస్ బుక్ తన నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించింది.