: గాంధీజీ, నేతాజీపై కట్జూ వ్యాఖ్యలను ఖండించిన పార్లమెంట్
జాతిపిత మహాత్మా గాంధీ బ్రిటీష్ ఏజెంట్ అని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జపాన్ ఏజెంట్ అంటూ సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలను పార్లమెంటు ఖండించింది. ఈ మేరకు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్యసభ ఓ తీర్మానం చేసింది. దాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. రాజకీయాల్లో మతాన్ని నెమ్మదిగా విస్తరింపజేసి, తరువాత బ్రిటీష్ 'విభజించు-పాలించు' విధానాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. అటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జపనీస్ ఏజెంట్ అని తన బ్లాగ్ లో కట్జూ విమర్శించారు. వ్యక్తిగతంగా నేతాజీ ధైర్యవంతమైన, నీతి, నిజాయతీ ఉన్న వ్యక్తని, కానీ జపనీస్ ఫాసిజానికి ఆయన ఏజెంట్ అయిపోయారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం రేపగా, కట్జూపై పలువురు మండిపడ్డారు.