: హాల్ టికెట్ రాలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ఏపీలో నేడు ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. అయితే పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్ ఇవ్వలేదన్న కారణంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. విజయనగరం జిల్లా వేపాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ధనలక్ష్మి, పరీక్షలకు హాజరయ్యేందుకు నేటి ఉదయం కళాశాలకు వచ్చింది. అయితే ఆమెకు కళాశాల సిబ్బంది హాల్ టికెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె కళాశాల ప్రాంగణంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్పందించిన కళాశాల సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.