: సంగక్కర అరుదైన అద్భుత రికార్డు


బలహీన స్కాట్లాండ్ జట్టుతో జరుగుతున్న పోరులో శ్రీలంక బ్యాట్స్ మెన్ కుమార సంగక్కర అరుదైన అద్భుత రికార్డును నమోదు చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో నాలుగు వరుస సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 86 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో సంగక్కర 101 పరుగులు చేశాడు. అంతకు నిమిషాల ముందు మరో ఆటగాడు దిల్షాన్ 97 బంతుల్లో 9 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోర్ 34 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 211 పరుగులు.

  • Loading...

More Telugu News