: సభలో లేకున్నా... సస్పెండ్ ఎలా చేస్తారు?: కేసీఆర్ సర్కారు తీరుపై సండ్ర ఫైర్
జాతీయ గీతాన్ని అవమానించారని ఆరోపిస్తూ మొన్న టీడీపీ సభ్యులను తెలంగాణ అసెంబ్లీ నుంచి కేసీఆర్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన గొడవ నేపథ్యంలో టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు సహా పది మందిని సస్సెండ్ చేశారు. ఈ మేరకు సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు, టీ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేరును ప్రస్తావించారు. మంత్రి ప్రతిపాదన మేరకు పది మంది సభ్యులను సస్సెండ్ చేస్తూ స్పీకర్ ప్రకటించారు. అయితే, ఆ సమయంలో సండ్ర వెంకట వీరయ్య సభలో లేరట. మొన్న ఈ తతంగం జరిగితే, నిన్న మీడియా ముందుకు వచ్చిన సండ్ర, సభలో లేని తననను సస్పెండ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. అయితే సండ్ర వెంకట వీరయ్య వాదనపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు.