: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్... పార్ట్-3
2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులోని ప్రధానాంశాలు ఇవే... * వాల్మీకి, బోయ, కేతి సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా * క్రిస్మన్, రంజాన్ లకు రెండేసి రోజుల సెలవు * బీడీ కార్మికులకు నెలకు రూ. వెయ్యి భృతి * అంగన్ వాడీ వంట పాత్రల కొనుగోలుకు రూ. వెయ్యి (వన్ టైమ్ గ్రాంట్) * తెల్ల రేషన్ కార్డు ఉన్న వారి ఆదాయ పరిమితి రూ. 60 వేల నుంచి రూ. 1.50 లక్షలకు పెంపు. పట్టణాల్లో అయితే రూ. 75 వేల నుంచి రూ. 2 లక్షలకు పెంపు. * ఎర్రజొన్న రైతులకు రూ. 13.50 కోట్లు * లక్ష ఎకరాలకు సాగు నీటిని అందించడమే లక్ష్యం * బడ్జెట్ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదు... అంకెల కూర్పు అసలే కాదు * 14వ ఆర్థిక సంఘం గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలను మిగులు బడ్జెట్ రాష్ట్రాలుగా గుర్తించింది * 2015-16 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు * 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ * 2018 నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 23,670 మిగావాట్లు చేయాలనేదే లక్ష్యం