: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్... పార్ట్-2


2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులోని ప్రధానాంశాలు ఇవే... * గిరిజన సంక్షేమానికి రూ. 2,878 కోట్లు * బీసీ సంక్షేమానికి రూ. 2,172 కోట్లు * ఎస్సీ సంక్షేమానికి రూ. 5,547 కోట్లు * రైతు రుణమాఫీకి రూ. 4,250 కోట్లు * గ్రీన్ హౌస్ కు రూ. 250 కోట్లు * చిన్న నీటిపారుదల శాఖకు రూ. 200 కోట్లు * గిడ్డంగులకు రూ. 403 కోట్లు * మార్కెటింగ్ శాఖకు రూ. 411 కోట్లు * హాస్టళ్లకు రూ. 2,200 కోట్లు * అంగన్ వాడీ టీచర్ల జీతాలు రూ. 7 వేలకు పెంపు * అంగన్ వాడీ కార్యకర్తల జీతం రూ. 4,500కు పెంపు * గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ. 8500 కోట్లు * జిల్లా పోలీస్ స్టేషన్ల అభివృద్ధికి రూ. 50 వేలు * గ్రామీణ పోలీస్ స్టేషన్ల అభివృద్ధికి రూ. 25 వేలు * వ్యవసాయ యూనివర్శిటీలకు రూ. 416 కోట్లు * ఫ్లై ఓవర్లకు రూ. 1,600 కోట్లు * ఎస్సీ సబ్ ప్లాన్ కోసం రూ. 8,089 కోట్లు * ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రూ. 5,036 కోట్లు * ఉస్మానియా యూనివర్శిటీకి రూ. 238 కోట్లు * రోడ్లు, భవనాలకు రూ. 4,980 కోట్లు * పంచాయతీ రాజ్ కు రూ. 2,421 కోట్లు * ఆహార సబ్సిడీకి రూ. 2,200 కోట్లు * డ్రిప్ ఇరిగేషన్ కు రూ. 200 కోట్లు * ఆసరా పెన్షన్లకు రూ. 4 వేల కోట్లు * ఆర్టీసీకి రూ. 400 కోట్లు * రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు రూ. 11,781 కోట్లు అయితే... రూ. 4,147 కోట్లు మాత్రమే వచ్చాయి * గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో 8 వేల కోట్లకు పైగా రాలేదు * హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ * ముచ్చెర్లలో 11 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ * కిలోవాట్ సామర్థ్యం గల 4వేల సోలార్ విద్యుత్ ప్లాంట్లు

  • Loading...

More Telugu News