: గవర్నర్ ప్రసంగంపై టోల్ ఫ్రీ నెంబరిస్తే బాగుండేది... టీ సర్కారుపై బీజేఎల్పీ నేత సెటైర్లు


తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంపై బీజేఎల్పీ నేత లక్ష్మణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవినీతిపై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లే, గవర్నర్ ప్రసంగంపై కూడా టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించి ఉంటే, ప్రజల స్పందన ఏమిటో తెలిసేదని ఆయన నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వ్యాఖ్యానించారు. ‘‘గవర్నర్ ప్రసంగంలో పరిశ్రమల పునరుద్ధరణ లేదు. దళితులకు భూపంపిణీ కాగితాలకే పరిమితమైంది. వర్సిటీల్లో జీతాలకూ దిక్కు లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై స్పష్టత లేదు’’ అంటూ ఆయన గరవ్నర్ ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News