: రూ. 1.10 లక్షల బడ్జెట్... మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యత: ఈటెల


కాసేపట్లో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు, ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు. గత బడ్జెట్లో కేంద్ర ప్రాధాన్యతలు తగ్గడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయని... ఈనాటి బడ్జెట్ పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పారు. ఈ బడ్జెట్ లో సంక్షేమం, వ్యవసాయం, నిరుద్యోగులకు ఉపాధి కల్పన తదితర అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News