: పెళ్ళయిన మూడో రోజే నవ దంపతుల ఆత్మహత్యాయత్నం... వధువు మృతి


కాళ్ళ పారాణి కూడా ఆరకముందే, పెళ్లి అయిన మూడో రోజున నూతన వధూవరులు గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలోని నంద్యాల రోడ్డు కాలనీలో నేటి ఉదయం చోటుచేసుకుంది. ఘటనలో వధువు మృతి చెందగా వరుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడిపత్రికి చెందిన పకీరప్ప (25)కు అదే గ్రామానికి చెందిన విజయలక్ష్మి (20)తో ఈ నెల 8న వివాహం జరిగింది. ఈ ఉదయం బంధువులు ఎంత పిలిచినా వారు తలుపులు తీయకపోవడంతో వాటిని బద్దలు కొట్టి చూసిన కుటుంబ సభ్యులకు రక్తపు మడుగులో పడున్న జంట కనిపించగా, ఇరు కుటుంబాల వారు విషాదంలో మునిగిపోయారు. విజయలక్ష్మి అక్కడికక్కడే చనిపోగా, ప్రస్తుతం పకీరప్ప పరిస్థితి విషమంగా ఉంది. వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News