: రెండు జట్లకూ గెలిచినా ఓడినా ఒకటే... స్కాట్లాండ్ పై భారీ స్కోర్ లక్ష్యంగా బరిలో లంక
వరల్డ్ కప్ క్రికెట్ పోటీలలో భాగంగా హోబర్ట్ లో శ్రీలంక, స్కాట్లాండ్ ల మధ్య జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన లంక కెప్టెన్ మాథ్యూస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మైదానం చిన్నదిగా ఉండటంతో సాధ్యమైనంత భారీ స్కోర్ చేయడమే లక్ష్యంగా లంక జట్టు బరిలోకి దిగింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ కు లంక చేరుకోగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా స్కాట్లాండ్ ఇంటిదారి పట్టనుంది. దీంతో నామమాత్రంగా జరుగుతున్న పోరులో సత్తా చాటాలని స్కాట్లాండ్ భావిస్తోంది. ప్రస్తుతం లంక స్కోర్ 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 46 పరుగులు. సంగక్కర 12, దిల్షాన్ 29 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు 4 పరుగుల స్కోర్ వద్ద తిరిమన్నె అవుట్ అయ్యాడు.