: క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం... సస్పెన్షన్ ను ఎత్తేయాలని గవర్నర్ ను కోరనున్న టీ టీడీపీ
శాసనసభలో జాతీయ గీతానికి అవమానం జరిగిన ఘటనకు సంబంధించి క్షమాపణలు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మరోమారు స్పష్టం చేశారు. నేటి ఉదయం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షమాపణలు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశామని చెప్పారు. అయితే ప్రభుత్వం మొండి పట్టుదలతోనే ముందుకుసాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షం సభలో లేకుండా ప్రభుత్వం బడ్జెట్ ను ఎలా ప్రవేశపెడుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సర్కారు మొండి వైఖరిపై ఉద్యమించేందుకు అన్ని వర్గాలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.