: భద్రాద్రి ప్రసాదం భారం... 50 నుంచి 100 శాతం ధరల పెంపు


తెలంగాణలోని పుణ్యక్షేత్రం భద్రాచలంలో స్వామివారి ప్రసాదం భక్తులకు భారం కానుంది. ప్రసాదాల ధరలను పెంచుతున్నట్టు దేవస్థానం ఈఓ తెలిపారు. పెంచిన ధరలు ఈనెల 21 నుంచి అమలులోకి వస్తాయని వివరించారు. 100 గ్రాముల సాధారణ లడ్డూ ధర ప్రస్తుతం రూ.10 ఉండగా రూ. 15కు, 400గ్రాముల బరువుండే కల్యాణ లడ్డూ ధర రూ. 50కి విక్రయించనున్నామని తెలిపారు. పులిహోర ప్యాకెట్ బరువును 200 గ్రాముల నుంచి 250 గ్రాములకు పెంచి ధరను రూ. 5 నుంచి రూ. 10కి, చక్కెర పొంగలి పరిమాణం 200 గ్రాముల నుంచి 150 గ్రాములకు తగ్గించి ధరను రూ. 5 నుంచి రూ. 10కి పెంచాలని ప్రతిపాదనలు చేశామన్నారు. ఈ రేట్లపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఇవ్వాలని భావిస్తే 10 రోజుల్లోగా దేవస్థానం కార్యాలయంలో అందజేయాలని కోరారు.

  • Loading...

More Telugu News