: ఎర్రచందనం స్మగ్లర్లపై ఏనుగు దాడి... శేషాచలం అడవుల్లో ఒకరు మృతి
శేషాచలం కొండల్లోని విలువైన ఎర్రచందనాన్ని అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలిస్తున్న స్మగ్లర్లపై ఇప్పటిదాకా పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది మాత్రమే దాడులు చేశారు. తాజాగా గజరాజుల దాడులు కూడా మొదలయ్యాయి. చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లోకి చొరబడ్డ 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లపై ఓ ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో జిల్లాలోని అల్లమిట్టకు చెందినట్లుగా భావిస్తున్న ఓ స్మగ్లర్ మరణించాడు. తిరుపతి సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో గజరాజు దాడి నేపథ్యంలో స్మగ్లర్లు భయంతో పరుగులు తీశారు.