: సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి కల్పనలే మా ప్రాధామ్యాలు... తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల
సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయానికి మరింత ఊతం, ఉపాధి కల్పనలే తమ ప్రభుత్వ ప్రాధామ్యాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఆయన కొద్దిసేపటి క్రితం అసెంబ్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ లో సంక్షేమ రంగానికి పెద్ద పీట వేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగుకు మరింత ఊతమిచ్చేలా కేటాయింపులున్నాయని ఆయన ప్రకటించారు. నిరుద్యోగుల ఆశలకనుగుణంగా ఉపాధి కల్పనకూ బడ్జెట్ లో ప్రాధాన్యమిచ్చామని ఆయన పేర్కొన్నారు. ఈ ఉదయం 10 గంటలకు ఆయన అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.