: మడోన్నా క్రేజ్ ఇంకా తగ్గలేదనడానికి ఇదే నిదర్శనం!
అమెరికన్ పాప్ గాయని మడోన్నా నుంచి ఈ మధ్య పెద్దగా హిట్స్ వచ్చింది లేదు. అయినాగానీ, అమ్మడి క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. 56 ఏళ్ల వయసులోనూ సెక్సప్పీల్ కనబరుస్తున్న ఈ అందాల సుందరి కచేరీలకు ఇంకా విపరీతమైన డిమాండ్ నెలకొని ఉంది. అమ్మడు డిసెంబర్ 9న ఫ్యాషన్ ప్రపంచ రాజధాని పారిస్ లో కచేరీ ఇవ్వనుంది. అందుకు సంబంధించి 15 వేల టికెట్లను అమ్మకానికి పెడితే 5 నిమిషాల్లో అయిపోయాయట. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న 'లైవ్ నేషన్' తెలిపిందీ వివరాలు. మడోన్నా ఆగస్టు 29 నుంచి వరల్డ్ టూర్ షురూ చేయనుంది. తన లేటెస్ట్ ఆల్బం 'రెబెల్ హార్ట్' ను ఈ సందర్భంగా ప్రమోట్ చేసుకోనుంది.