: 'రాజమండ్రి' అవినాష్ పై మోసం, బెదిరింపుల కేసులు


తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో... హోం మంత్రి చినరాజప్ప బంధువునని, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ప్రతినిధినని, మానవహక్కుల పరిరక్షణ సంఘం సభ్యుడినని చెప్పుకుంటూ, స్కూళ్లలో తనిఖీలు చేస్తూ, నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకుంటున్న అవినాష్ పై ఏఎస్పీ దామోదర్ కు బాధిత మహిళ ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 15 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం అతడు ముఖం చాటేయడంతో డబ్బులు అడిగానని, అయితే, ఓ వీడియో పంపి బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె తెలిపారు. దీంతో, అవినాష్ పై మోసం, బెదిరింపుల కేసులు నమోదు చేశారు. కాగా, జరిగిన దారుణాన్ని టీవీల్లో చూసిన మానవహక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేసింది. ఫిర్యాదులకు సాక్ష్యాలు లేవంటూ అతనిని వదిలిపెట్టిన పెద్దాపురం ఎస్సై శివకృష్ణ, సీఐ శ్రీధర్ బాబులకు ఎస్పీ రవిప్రకాశ్ మెమోలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News