: ఒంటె పాలకు హైదరాబాదులో హై డిమాండ్... తాగితే ఉపశమనం కలుగుతుందట!


ఒంటె పాలను కూడా తాగుతారన్న విషయం ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. వాటికి ఔషధ గుణాలున్నాయంటూ ఇప్పుడు హైదరాబాదులో ఒంటె పాల వ్యాపారం భేషుగ్గా నడుస్తోంది. ఒంటెపాలు తాగితే పలు జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రచారంలో ఉంది. దీంతో, హైదరాబాదులో ఒంటె పాలకు డిమాండ్ పెరిగిపోయిందట. రాజస్థాన్ కు చెందిన ఓ వ్యాపారి భారీ సంఖ్యలో ఒంటెలతో వచ్చి నగరంలోని మూసారాంబాగ్ లో సెటిలయ్యాడు. ఇప్పుడు ఆ వ్యాపారి ఒంటె పాలను విక్రయిస్తున్నాడు. ప్రజలు ఒంటె పాలకు ఆవు, గేదె పాలకంటే అధిక ధర చెల్లిస్తున్నారట.

  • Loading...

More Telugu News